ఫ్లైఓవర్‌ను ఢీకొన్న డీసీఎం..

బేగంపేట ఆగస్టు 30 (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
బెగంపేటలో డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఫ్లైఓవర్‌ను ఢీకొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శామీర్‌పేట మండలం దేవరయంజాల్‌కు చెందిన నీలా నరేశ్ (35) ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెగంపేట పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.ఫిర్యాదు ప్రకారం.. రెండు నెలల క్రితం టీజీ 07 ఎక్స్ 9077 నంబరు గల డీసీఎం ట్రక్కును కొనుగోలు చేసిన నరేశ్, కండ్లకోయగ్రామంలోని బిగ్‌బాస్కెట్‌కు లీజుకు ఇచ్చారు. గత 20 రోజులుగా సంజాస్ ఖాన్ (24) డ్రైవర్‌గాపనిచేస్తున్నాడు.ఆగస్టు 29న తెల్లవారుజామున 2.30 గంటలకు కూరగాయలు, పాలు, పెరుగు తదితర సరుకులను అన్‌లోడ్ చేసేందుకు వాహనాన్నితీసుకెళ్లాడు. సుమారు 4.30 గంటల సమయంలో పి&టీ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడిపి ఫ్లైఓవర్ కుడివైపు భాగాన్ని ఢీకొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రమాదంలో డీసీఎం ముందు, వెనుక భాగాలుదెబ్బతిన్నాయని తెలిపారు. డ్రైవర్‌పైచట్టపరమైన చర్యలు
తీసుకోవాలని కోరడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *