వీళ్ళు వేయడం మానరు..వాళ్ళు తీయడం తప్పదు.తాతా చారి కాలనీ నుంచి ఇందిరాగాంధీ పురం రోడ్డు లో నిత్యం పేరుకుంటు న్న చెత్త .

బేగంపేట సెప్టెంబర్ 1,(జే ఎస్ డి ఎం న్యూస్) :
వీళ్ళు వేయడం మానరు.అయినా నిత్యం వాళ్ళు తీయడం తప్పదు.ఇది ప్రకాశం నగర్ డివిజన్ శ్యామ్ లాల్ బిల్డింగ్ తాతా చారి కాలనీ నుంచి ఇందిరా గాంధీపురం వెళ్ళే రోడ్డులో దర్గా ముందు ఇలా స్థానికులు చెత్త పడవేయడం తో చెత్త గుట్టలుగా పేరుకు పోతుంది. జీ హెచ్ ఎం సి శానిటేషన్ సిబ్బంది నిత్యం ఇక్కడి చెత్తను తొలగిస్తున్నా స్థానికులు,ఇతర ప్రాంతాలకు చెందిన వారు రాత్రికి రాత్రి చెత్త తో పాటు చికెన్ వ్యర్థాలను మూటలు కట్టి ఇక్కడ పడవేసి వెళుతుండటం వాటిని కుక్కలు,పిల్లులు నివాసాల ముందు తెచ్చి పడవేస్తుండటంతో అవి తీవ్ర దుర్వాసన వెదజల్లుతుండటంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై జీ హెచ్ ఎం సి శానిటేషన్ అధికారులు స్థానికులకు అవగాహన కల్పించక పోవడం పై కూడా స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిత్యం చెత్త పేరుకు పోయి తీవ్ర దుర్వాసన వెద జల్లుతుండటంతో భోజనం కూడా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కోళ్ల వ్యర్థాలు,భవన నిర్మాణాల వ్యర్థాలు కూడా వేస్తుండటం తో అవి కొండలా పేరుకు పోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
స్థానికంగా కోళ్ల వ్యర్థాలు వేస్తుండటం తో పెద్ద సంఖ్యలో పక్షులు వస్తున్నాయని,బేగంపేట విమానాశ్రయం నుంచి శిక్షణ విమానాలు ప్రయాణిస్తుంటాయి.పక్షుల గుంపులతో శిక్షణ విమానాలకు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.ఈ సమస్యలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని శానిటేషన్ అధికారులు స్థానికులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *