తాళ్లూరు: మండలంలో వినాయక చవితి సందర్భంగా ఘన నాధునికి ఘన పూజలునిర్వహించారు. చిన్నారులు మట్టి గణపతులను ఏర్పాటు చేసి పూజా సామగ్రి నిమిత్తం పొలాల వెంబడి తిరిగి సేకరించారు. వర్షాలు లేక పోవటంతో అవనమైన పత్రి అందుబాటులోనికి రాలేదు. మండలంలో వివిధ గ్రామాలలో గణేష్ ఉత్తవ కమిటీల ఆధ్వర్యంలో 48 విగ్రహాలను ఏర్పాటు చేసారు. అందులో గణ నాథులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆయా మండపాలను ఎస్సై మల్లిఖార్జున రావు తన సిబ్బందితో సందర్శించి పలు సూచనలు చేసారు. డీజేలు నిషిద్ధమని, రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేసుకోకుండా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని ఎస్పై సూచించారు.
