ఏపీలోని పోలవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిని వంట మనిషి గర్భవతిని చేశాడు. సదరు బాలిక అస్వస్థతతో ఆసుపత్రిలో చేరగా విషయం వెలుగులోకి వచ్చింది. అదే స్కూల్లో పనిచేసే మంగరాజు అనే వంట మనిషి తనపై 3 సార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తెలపడంతో, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం వహించిన హెడ్మిస్ట్రెస్, హెచ్ఐడబ్ల్యూఓ, మరో టీచర్ని అధికారులు సస్పెండ్ చేశారు..
