ఘనంగా ఇంజనీర్స్ డే నిర్వహించిన ఏ సి సి ఈ ఐ ACCE(I) .ఇంజినీరింగ్‌ ప్రతిభకు సత్కారం; RIDES 2026 కాన్ఫరెన్స్‌ బ్రోచర్‌, రిజిస్ట్రేషన్‌ ఆవిష్కరణ.

బేగంపేట సెప్టెంబర్ 15,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఇంజినీర్లు కేవలం నిర్మాణాల రూపకర్తలు కాదనీ ,దేశ నిర్మాణకర్తలు అని ఆ
ఏ సి సి ఈ (ఐ) చైర్మన్ భీమ్‌రావు జలిగామ అన్నారు.కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్లకు చెందిన ప్రముఖ జాతీయ సంస్థ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా (Association of Consulting Civil Engineers India (ACCE-I)) హైదరాబాద్ సెంటర్, ఇంజినీర్స్ డే 2026ను మంగళవారం గ్రీన్‌ల్యాండ్స్‌, బేగంపేట్‌లోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో ఘనంగా నిర్వహించారు. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈకార్యక్రమంలో భారతదేశపు గొప్ప ఇంజినీర్లలో ఒకరైన, దార్శనిక దేశ నిర్మాణకర్తగా విశ్వేశ్వరయ్యకు ఘన నివాళులు అర్పించారు.
ACCE(I) కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్లు, సివిల్ ఇంజినీరింగ్ రంగానికి అనుబంధంగా ఉన్న నిపుణులకు ప్రాతినిధ్యం వహించే జాతీయ వృత్తిపరమైన సంస్థ. 41 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 54 కేంద్రాల్లో 10,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు. హైదరాబాద్ కూడా ACCE(I)కు చెందిన ముఖ్యమైన కేంద్రాల్లో ఒకటి. సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల మధ్య వృత్తిపరమైన నైపుణ్యం, సాంకేతిక పురోగతి, నైతిక విలువలు, జ్ఞాన మార్పిడి, సహకారం పెంపొందించేందుకు ACCE(I) ఒక బలమైన వేదికగా పనిచేస్తోంది.
ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, ఇతర ఏజెన్సీలతో విధానపరమైన అంశాలపై సంప్రదింపులు జరుపుతూ కన్సల్టింగ్ ఇంజినీర్ల ప్రయోజనాలను సంస్థ ప్రతినిధ్యం వహిస్తోంది. వృత్తిపరమైన ప్రతిభ, నైతికత, జ్ఞాన
భాగస్వామ్యం, సామాజిక బాధ్యత, సుస్థిర అభివృద్ధి ACCE(I) ప్రధాన సిద్ధాంతాలుగా ఉన్నాయన్నారు. సివిల్ ఇంజినీర్లను Nation Builders గా అభివర్ణించే ACCE(I), భవిష్యత్ తరాల కోసం సుస్థిర సమాజాన్ని నిర్మించడం, సహజ వనరులను పరిరక్షించడం, మెరుగైన పర్యావరణాన్ని సృష్టించడం ఇంజినీర్ల బాధ్యతగా పేర్కొంటోందన్నారు.ఈ కార్యక్రమానికి ACCE(I) సెక్రటరీ జనరల్ అడెపు కాశీరాం ముఖ్య అతిథిగా, ACCE(I) మాజీ వైస్ ప్రెసిడెంట్ (సౌత్) రాజ్‌కుమార్ కాచర్ల గౌరవ అతిథిగా హాజరయ్యారు.
ACCE(I) సెక్రటరీ జనరల్ అడెపు కాశీరాం మాట్లాడుతూ, “ఇంజినీరింగ్ రంగం వేగంగా మారుతోంది. మారుతున్న ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంజినీర్లు తమ జ్ఞానం, నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలి. జ్ఞాన భాగస్వామ్యం,ఆవిష్కరణలు, సహకారానికి బలమైన వృత్తిపరమైన వేదికను అందించేందుకు ACCE(I) కట్టుబడి ఉంది. అదే సమయంలో నాణ్యత, నైతిక విలువలు, వృత్తిపరమైన ప్రతిభకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంజినీర్ల సమిష్టి నైపుణ్యం దేశానికి మరింత సురక్షితమైన, స్మార్ట్‌, సుస్థిర మౌలిక వసతులుగా రూపాంతరం చెందాలి అని అన్నారు.స్వాగత ప్రసంగం చేసిన ACCE(I) చైర్మన్ భీమ్‌రావు జలిగామ, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన చిరస్మరణీయ సేవలను గుర్తుచేశారు. ఆయన కేవలం ఒక గొప్ప ఇంజినీర్ మాత్రమే కాదని, దార్శనిక దేశ నిర్మాణకర్త అని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర డ్రైనేజీ వ్యవస్థ, మూసీ నది సంబంధిత ప్రాజెక్టులతో సహా విశ్వేశ్వరయ్య అందించిన సేవలను ప్రస్తావిస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
విశ్వేశ్వరయ్య తరతరాల ఇంజినీర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మనం కేవలం నిర్మాణాలను నిర్మించే వారు కాదు; మనం దేశ నిర్మాణకర్తలం,” అని భీమ్‌రావు జలిగామ అన్నారు. ఇంజినీరింగ్ వృత్తిలో వృత్తిపరమైన ప్రతిభ, జ్ఞాన భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడంలో ACCE(I) కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు.ACCE(I) వైస్ చైర్మన్ సి. రమేష్ మాట్లాడుతూ, “ఇంజినీరింగ్ అంటే కేవలం భౌతిక మౌలిక వసతులను రూపకల్పన చేసి నిర్మించడం మాత్రమే కాదు; ప్రజల జీవితాలను మెరుగుపరిచి, సమాజాన్ని బలోపేతం చేసే పరిష్కారాలను అందించడం కూడా. ఇంజినీర్లుగా మన జ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకోవడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవడం, అత్యున్నత వృత్తిపరమైన నైతిక ప్రమాణాలను పాటించడం మన బాధ్యత.
నైపుణ్యం, ఆవిష్కరణలు, జ్ఞాన భాగస్వామ్యంతో ఇంజినీరింగ్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి, అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ACCE(I) హైదరాబాద్ సెంటర్ కార్యవర్గ సభ్యులు భీమ్‌రావు జలిగామ, చైర్మన్; సి. రమేష్, వైస్ చైర్మన్; డి.ఎస్. జయ ప్రకాష్, సెక్రటరీ; రుద్ర అమర్‌నాథ్ బాబు, ట్రెజరర్; ఎస్. మహేందర్ రెడ్డి, ఇమ్మీడియట్ పాస్ట్ చైర్మన్ & GC మెంబర్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో ఇంజినీరింగ్ వృత్తి, మౌలిక వసతుల రంగానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను Eminent Engineer Awardsతో సత్కరించారు. డి. పుటరయ్య, వి. వినోద్ భార్గవ, ప్రొఫెసర్ పి. శ్రీనివాస్ శర్మ, డాక్టర్ మల్లిక అలపాటిలను వారి విశిష్ట సేవలకు గుర్తింపుగా సత్కరించారు ఇంజినీర్ల సమాజానికి అందించిన విశేష సేవలు, చేసిన కృషికి గుర్తింపుగా వి.వి. కృష్ణారెడ్డికి National Eminent Engineer Awardను ప్రదానం చేశారు.
RIDES 2026 కాన్ఫరెన్స్‌ బ్రోచర్‌, రిజిస్ట్రేషన్‌ ఆవిష్కరణ
ఇంజినీర్స్ డే వేడుకల్లో భాగంగా నవంబర్ 2026లో నిర్వహించనున్న RIDES 2026 Conferenceకు సంబంధించిన బ్రోచర్‌, రిజిస్ట్రేషన్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. సివిల్ ఇంజినీరింగ్ రంగంలో Resilient, Innovation, Design, Engineering, Sustainable Practices తదితర అంశాలతో పాటు సమకాలీన సాంకేతిక పరిణామాలు, జ్ఞాన భాగస్వామ్యం, వృత్తిపరమైన నెట్‌వర్కింగ్‌, ఆవిష్కరణలు, భవిష్యత్ సవాళ్లపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చలు జరగనున్నాయి. దేశ, విదేశాలకు చెందిన నిపుణులు పాల్గొనే ఈ సదస్సులో మొత్తం 12 కీలక సెషన్లునిర్వహించనున్నారు.
ఈ వేడుకలు విజయవంతం కోసం సహకారం అందించిన Sarwottam TMT మరియు Adani Cementకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *