ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలించిన మంత్రి డా.స్వామి

ప్రకాశం / ఒంగోలు, సెప్టెంబర్ 21 : ఒంగోలులో నిర్మాణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను సోమవారం నాడు రాష్ట్ర మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రి, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, పనుల వివరాలను సంబంధిత ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ నిర్మాణంలో చేపడుతున్న వివిధ పనులు, మౌలిక వసతుల ఏర్పాట్లు, కార్యాలయ వినియోగానికి అనుగుణంగా చేపడుతున్న నిర్మాణ ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత ప్రణాళిక ప్రకారం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా పార్టీ కార్యాలయాన్ని తీర్చిదిద్దడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత సమన్వయంతో నిర్వహించేందుకు అవసరమైన వసతులు కల్పించడంపై దృష్టి సారించామన్నారు.
పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు కార్యాలయం ఒక సమన్వయ వేదికగా నిలుస్తుందని, ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత వర్గాలతో సమన్వయం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి మరింత ముందుగానే కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *