యువతలో హెచ్ఐవి/ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించేందుకు జిల్లా స్థాయి క్విజ్ పోటీ

ఒంగోలు, సెప్టెంబర్ 21, 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (AP SACS) వారి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి సూచనలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రెడ్ రిబ్బన్ క్లబ్ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో యువతలో హెచ్ఐవి/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి క్విజ్ పోటీని సోమవారం PVR ప్రభుత్వ బాలుర కళాశాలలో నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ క్విజ్ పోటీలో జిల్లా స్థాయి నుంచి మొత్తం 14 టీమ్‌లు పాల్గొని, హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ, వ్యాప్తి, చికిత్స, అపోహలు, యువత ఆరోగ్యం తదితర అంశాలపై క్విజ్ పోటీలను నిర్వహించారు.

పోటీలో ప్రథమ బహుమతి రూ.5,000/-ను SPCM ప్రభుత్వ జూనియర్ కళాశాల, టంగుటూరు విద్యార్థులు, ద్వితీయ బహుమతి రూ.4,000/-ను జిల్లా పరిషత్ హైస్కూల్, చాకిచెర్ల విద్యార్థులు, తృతీయ బహుమతి రూ.3,000/-ను ప్రభుత్వ జూనియర్ కళాశాల, సింగరాయకొండ విద్యార్థులు సాధించారు. కన్సొలేషన్ బహుమతి రూ.2,000/-ను సెయింట్ జేవియర్ స్కూల్, ఒంగోలు విద్యార్థులు పొందారు.

విజేతలకు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ జి. బాలాజీ చేతుల మీదుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ మరియు నగదు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ జి. బాలాజీ మాట్లాడుతూ, యువతకు హెచ్ఐవి/ఎయిడ్స్‌పై సరైన అవగాహన కల్పించడం ద్వారా అపోహలను తొలగించి, వ్యాధి నివారణకు సమాజంలో చైతన్యం తీసుకురావచ్చని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంతో పాటు, హెచ్ఐవి/ఎయిడ్స్‌పై శాస్త్రీయ అవగాహనను ఇతరులకు కూడా కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ జి. బాలాజీ , SK. అమీన్ సాహెబ్ (దిశా CPM), పి. కిరణ్ కుమార్ రెడ్డి (దిశా CPO), S. సాయి (దిశా CSO), కొలకలూరి ఆలీ బాబు (PVR ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్), గాలి స్వరూప్ కుమార్ (DRP), SK. పీర్ భాష (GROW TI-PM), పి. వెంకటేశ్వర్లు గారు (SNIRD-PM), B. దుర్గా సురేంద్ర (HELP-PM), CH. క్రాంతి కుమార్ గారు (MMS-M&E) తదితరులు, అలాగే లింక్ వర్కర్స్ మరియు ఔట్రీచ్ వర్కర్స్ పాల్గొన్నారు.

యువతలో హెచ్ఐవి/ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *