బేగంపేట సెప్టెంబర్ 22,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే అడ్డంకులు, కష్టాలను తొలగించే దేవుడు వినాయకుడు అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా అమీర్ పేట డివిజన్ లోని పలు కాలనీలు, బస్తీ లలో ఏర్పాటు చేసిన గణ నాధులను సోమవారం
రాత్రి ఆయన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ముందుగా వెల్ నెస్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణ నాధుడినిదర్శించుకున్నారు. అనంతరం లీలా నగర్, కుమ్మరి బస్తీ, గురుద్వార్, బీ జే ఆర్ నగర్ 1,2, ప్రశాంత్ కాలనీ, బల్కంపేట, సత్యం థియేటర్ సర్కిల్, ధరం కరం రోడ్డు, జైన్ భవన్, ఎస్సార్ నగర్, SRT కాలనీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణ నాధులను
దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు నామన సంతోష్ కుమార్, దాడి ప్రవీణ్ రెడ్డి, టిల్లు బాయి, ప్రదీప్ గౌడ్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, సుమిత్ సింగ్, శ్రీశైలం, విక్కీ తదితరులు ఉన్నారు.



