తాళ్లూరు: స్థానిక సంస్థల ఎన్నికలను కలసి కట్టుగా ఎదుర్కోని మండల ఎంపీపీ పదవిని టిడిపి ఖాతాలో వేసుకోవాలని దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు అన్నారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియనున్న నేపధ్యంలో వారికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు ఘనంగా వారిని సన్మానించారు. గత ఎన్నికలలో ప్రతిపక్షపార్టీ నుండి గెలిచి నేడు అధికార పార్టీలో ఉ న్న ప్రజా ప్రతినిధులు, టిటిపి నేతలు కలిసి కట్టుగా పనిచేసి తాళ్లూరు మండలంలో టిడిపి జెండా రెప రెప లాడించాలని డాక్టర్ గొట్టిపాటి, డాక్టర్ లిలిత్ సాగర్లు దిశానిర్ధేశం చేసారు. కలిసి కట్టుగా నిస్వార్థంగా పనిచేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీ గూడ సరస్వతి దంపతులను, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిని ఘనంగా సన్మానించారు. ముందుగా డాక్టర్ గొట్టిపాటి దంపతులను ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మానంరమేష్ బాబు, ఓబులు రెడ్డి, బడే, వెంకట రావు, సాగర్, సుబ్బా రెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, తూము శివ నాగి రెడ్డి, పోశం శ్రీకాంత్ రెడ్డి, వేణుబాబు, పిన్నక రమేష్, సుజాత, హనుమంతరావు, కళ్యాణ్ చక్రవర్తి, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మి నారాయణ సుదాకర్, రామయ్య వివిధ హెూదాల్లో నాయకులు ఘన స్వాగతం పలికారు. వారిని ఘనంగా సన్మానించారు. ఐక్యంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటుతామని హామీ ఇచ్చారు.










