శాఖల పనితీరును తెలిపే కేపీఐ ( కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ) లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. బుధవారం ప్రకాశం భవనంలో పలు శాఖలతో ఆయన సమావేశం నిర్వహించి వాటి పనితీరుపై సమీక్షించారు. కేపీఐలను ప్రభుత్వం క్రమంగా సమీక్షిస్తూ జిల్లాల వారీగా పురోగతిని పరిశీలిస్తున్నందున అన్ని శాఖల అధికారులు వీటిపై మరింత శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ చెప్పారు. మన జిల్లాతో సంబంధం లేని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిస్తే వెంటనే ఆయా విషయాలను శాఖాధిపతుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని తొలగించేలా చూడాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మొత్తంగా చూస్తే జిల్లా ర్యాంకు మెరుగైన స్థాయిలో ఉండేలా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో సిపిఓ సుధాకర్ రెడ్డి, డిఎఫ్వో ( టెరిటోరియల్ ) వినోద్ కుమార్, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఈ. నాగేశ్వరరావు, ఉద్యాన అధికారి గోపీచంద్, జిల్లా సహకార అధికారి శ్రీలక్ష్మి, డిపిఓ అనుపమ, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాసరావు, డ్వామా పి.డి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
