పోలిస్ శిక్షణా కాలంలో ఇచ్చే పారితోషకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.4500 ల నుండి రూ.12,500 లకు పెంచింది… మంత్రి శ్రీ.డోలా బాల వీరంజనేయులు. మహిళా పోలీసులుకు పోలిస్ విధులతో కుటుంబ బాధ్యతలను కూడా సమర్దవంతంగా పోషించాలి.. మంత్రి.. ఉద్యోగ విదుల పట్ల అంకిత బావం, సానుభూతి మరియ సంగ్రతలో పని చేయాలి… జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు.. మహిళా పోలీసులు క్రమ శిక్షణతో నడిచి శాఖకు మంచి పేరు తేవాలి…. జిల్లా యస్.పి.హర్ష వర్ధన్ రాజు…

సమాజంలో మహిళలు అంటే ఉండే చిన్న చూపు చేరిపెలా మహిళా పోలీసులు విధుల భాద్యతలు సమగ్రంగా పోషిచాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మాత్యులు డా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
గురువారం స్థానక ఒంగోలు పోలీస్ శిక్షణా కాలేజి నందు మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమములో ముఖ్య అతిధి గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 9 నెలల కఠోర శిక్షణ అనంతరం ప్రత్యక్ష విధులలో చేరడం జరుగుతోందన్నారు. ఉదయం 5.45 గంటల నుండి సాయంత్రం వరకు వివిధ అంశాలలో శిక్షణ అనంతరం కొంత బరువు తగ్గారని, తదుపరి విధులు నిర్వహిస్తూ శరీర దారు డ్యాన్ని యోగా వంటి వాటి ద్వారా కాపాడుకోవలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శిక్షాణా కాలంలో ఇచ్చే స్టైఫెండ్ ను రూ.4500 ల నుండి రూ.12500 లకు పెంచిన దని అన్నారు . ఈ రోజు నిర్వహించిన కవాతు చాల బాగుందన్నారు. పోలిస్ యూనిఫారం వేసుకొని న్యాయం, ధర్మం, చట్టాని, సమాజంలో సమస్యలకు న్యాయం చేయాలన్నారు. రానునున్న రోజులలో వస్తున్న సైబర్ క్రైం వంటి విభిన్న పోకడలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. సుసిక్షితమైన శిక్షణ అనంతరం విధుల లో ప్రత్యక్షంగా చేరడం జరుగుతుందన్నారు. శాఖకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని అన్నారు. అంతా తెలుసు అనే ధోరణి వీడి అవసరమైనప్పుడు సినియర్ల సలాహాలు, సూచనలు తీసుకోలన్నారు. పోలీస్ యూని ఫారం చూడగానే సమాజం గౌరవించేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. యూనిఫారం ఇచ్చిన పవర్ను గౌరవంగా చూసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు మాట్లాడుతూ ….. తొమ్మిది నెలల కఠోర శిక్షణ అనంతరం రాజ్యంగా బద్దంగా ప్రమాణం చేసుకొని నిజమైన కర్తవ్యంలో కి వచ్చే రోజని కొనియాడారు. ఈ శిక్షణా కాలెంలో వివిధ అంశములపై శిక్షణ ఇవ్వడం జరిగిందని, శాంతి భద్రతలు,ప్రభుత్వం, ప్రజల నమ్మకాన్ని కాపాడాలన్నారు. విధుల పట్ల అంకిత భావం అవసరమన్నారు. యూనిఫారం దరించ గానే తెలియని అథారిటి వస్తుందని, చేసే ఉద్యోగాన్ని బట్టి గౌరవం పెరుగుతుందన్నారు. సమాజంలో పెరుగుతున్న సాంకేతికత, క్రైముల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలనారు. రాజ్యాంగ బద్దంగా చేసిన ప్రమాణాన్ని విధులలో చేరి నప్పటి నుండి పాటించాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
జిల్లా యస్.పి.హర్ష వర్ధన్ రాజు మాట్లాడుతూ శిక్షణ కు ముందు హాజరవ్వం జరిగిందని, అపుడే శిక్షణ పూర్తి అయి పాస్ అవుట్ పెరేడ్ కు హాజరవ్వడం అనంగంగా ఉందన్నారు. విధుల పట్ల విలువలు, ప్రిన్సిపల్స్ విధిగా పాటించాలన్నారు. ప్రజా సేవలో అంకిత భావంతో పని చేయాలన్నారు. శిక్షణ పొందిన వారిలో భాగా చదువుకొన్న వారు ఉన్నారని, వారు మరింత ముందుకు వెళ్ళేలా పోటీ పరీక్షలలో పోటీ పడాలని సూచించారు. శాఖ యొక్క  అంచనాలను ఎప్పటికప్పుడు అంది పుచ్చుకోవాలని సూచించారు.
స్థానిక శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం లో    పాల్గొనడం ఆనంద దాయకమన్నారు. పది జిల్లా లను సుమారు నా లుగ వందల డెబ్బై మంది శిక్షణ పొందారని తెలిపా రు. శిక్షణ పొందిన వారిలో మంచి విద్యార్హతలు ఉన్న వారు ఉన్నారని, వారు పోటీ పరీక్షలో పోటి పడి  ఉన్నత స్థితికి చేరుకోవాలాన్నారు. పోలీస్ యూనిఫాం చూసి ప్రజలు మేలు జరుగుతుందనే దాన్ని కాపాడాలన్నారు. ప్రభుత్వం పోలీ శాఖలో 5757 పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. మరిన్ని కొత్త ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందన్నారు.

తొలుత ఈ సందర్బంగా పోలీస్ శిక్షణా కాలేజి ప్రిన్సిపాల్ రాధిక శిక్షనా కార్యక్రమం గురించి వివరించారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి వివిధ విభాగాల్లో పురస్కారాలు అందజేశారు.బెస్ట్ ఆల్‌రౌండర్ & బెస్ట్ ఇండోర్: కర్నూలు జిల్లాకు చెందిన చాకలి ప్రత్యూష. బెస్ట్ అవుట్‌డోర్: విజయనగరం జిల్లాకు చెందిన నారపురెడ్డి పావని.బెస్ట్ ఫైరర్: కడప జిల్లాకు చెందిన అమ్మిరెడ్డి అరుణ.పరేడ్ కమాండర్: కడప జిల్లాకు చెందిన దద్దినాల చాముండేశ్వరి లకు అవార్ద్జులు అంద  చేసారు.




Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *