తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన నేరేళ్ల శారద.అభినందించిన కమిషన్ సభ్యులు, రాజకీయ నాయకులు.

హైదరాబాద్ సెప్టెంబర్ 24 (జె ఎస్ డి ఎం న్యూస్)
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా
నేరెళ్ల శారద రెండవసారి బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా నేరేళ్ల శారదను మహిళా కమిషన్ సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు అభినందించారు. రెండవసారి నేరెళ్ళ శారద అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మహిళా కమిషన్ కార్యాలయం, బుద్ధ భవన్ కు చేరుకున్న నేరెళ్ళ శారద కి కమిషన్ కార్యదర్శి పద్మజ రమణ సిబ్బంది వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘన స్వాగతం పలికారు. తమ ఛాంబర్
లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనపై ఎంతో నమ్మకంతో రెండవసారి మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి సమస్య ఏదురైనా మహిళా కమిషన్ అండగా ఉంటుందని చైర్ పర్సన్ తెలిపారు. మహిళలపైన దాడులు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.
అనంతరం చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ళ శారద కి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావ్ , బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మహిళా,శిశు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి శృతి ఓజా , శాసనమండలి విప్ బల్మూర్ వెంకట్, ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధు గౌడ్ యాష్కి, మహిళా కమిషన్ చిట్యాల శ్వేత , ఉజ్మా ఆషయ్ షాకీర్ , ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రితం , బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి , టిపిసిసి ప్రధాన కార్యదర్శి సింగం చరణ్ కౌశిక్ యాదవ్, గౌడ సంఘం నాయకులు, మహిళా కమిషన్ ఎస్.ఓ లు, కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని చైర్ పర్సన్ కి శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *