స్మార్ట్‌జెన్ విద్యార్ధులు అరుదైన హోప్ వరల్డ్ రికార్డ్ – అంతర్జాతీయ ఆశా కిరణాలుగా 5 మంది విద్యార్థులకు గుర్తింపు

ఒంగోలు : విద్యార్థి దశ నుంచే కళలు,విద్య, క్రీడలు మరియు సామాజిక సేవా రంగాల నుండి అందించే అరుదైన గౌరవం సింగరాయకొండ మండల పరిధిలోని మూలగుంటపాడు లో ఉన్న స్మార్ట్ జెన్ స్కూల్ కు చెందిన 5 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ప్రశంసా పత్రాలు హోప్ ప్రతినిధుల సోమవారం అందించారు . ఈ సందర్భంగా స్మార్ట్ జెన్ కరస్పాండెంట్ డాక్టర్ గీతా రాణి మాట్లాడుతూ …….సింగరాయకొండకు చెందిన బాల నృత్య కళాకారిణులు గా స్థానిక విద్యా సంస్థలలో ఒక్క స్మార్ట్‌జెన్ గ్లోబల్ స్కూల్ నుండి 5 మంది ఈ అరుదైన రికార్డును విద్యార్థులు సాధించటం గర్వంగా ఉందని అన్నారు. వీరిలో ఈదర అమూల్య ( గ్రేడ్ 9), ఈదర సుహాస్ర (గ్రేడ్ 6), కొల్లూరు తీక్షణ వెంకట శ్రీ (గ్రేడ్ 6), కొలపర్తి వెంకట సాయి ఆరాద్య (గ్రేడ్ 6), మరియు గొట్టుల శ్రీ ప్రవస్థి ప్రియ (గ్రేడ్ 8) లు ప్రతిష్ఠాత్మకమైన హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారని తెలిపారు. కూచిపూడి, భరతనాట్యం, సామాజిక సేవ, సాంస్కృతిక, సాహిత్య మరియు ఆధ్యాత్మిక రంగాలలో వారు చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా సంస్థ ఈ అంతర్జాతీయ రికార్డును (రిజిస్ట్రేషన్ నంబర్: హెచ్ ఐ బి డబ్ల్యు ఆర్/2026/449) ప్రకటించింది. యువతను, సమాజాన్ని ప్రోత్సహిస్తూ వారు చూపిన క్రమశిక్షణ, అంకితభావాన్ని కొనియాడుతూ హోప్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాసులు, జెనరల్ మేనేజర్ హరిప్రసాద్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *