ఒంగోలు వైభవానికి నాటి తీపి గుర్తులే సాక్ష్యం: ‘ఒంగోలు ఉత్సవం’లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా స్థానిక మినీ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ‘ఒంగోలు ఉత్సవం’ కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ, ఒంగోలు నగరంతో తనకున్న సుదీర్ఘమైన, పేగుబంధం లాంటి ప్రత్యేక అనుబంధాన్ని ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు. ఒంగోలు చారిత్రక నేపథ్యాన్ని, పూర్వీకుల వైభవాన్ని భావితరాలకు అందించడానికి రేగొండ మల్లికార్జున రావు రచించిన ప్రత్యేక పుస్తకం ఎంతో ఆసక్తికరంగా ఉందని, ప్రజలందరూ దీనిని చదివి మన మూలాలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాజకీయ జన్మనిచ్చిన గడ్డ – ధనబలం కాక గుణబలమే ముఖ్యం

తన రాజకీయ ప్రస్థానం 1977లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచే ప్రారంభమైందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువకుడిగా తనను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరించారని గుర్తుచేసుకున్నారు. నాటి ఎన్నికల్లో ప్రజలే స్వచ్ఛందంగా తన వెంట నడిచి, జీపు యాత్రలో రూ.200, రూ.300 చొప్పున నిధులు ఇచ్చి ధన వర్షం కురిపించారని, ఆనాడు రూపాయి కూడా అవినీతికి తావులేకుండా రాజకీయాలు చేశానని చెప్పారు. నేటి రాజకీయాల్లో ధన ప్రభావం, కుల ప్రాంత భేదాలు ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… వ్యక్తిత్వం, సామర్థ్యం, నడవడిక (Character, Caliber, Capacity, Conduct) ప్రాతిపదికగానే ప్రజలు తమ నాయకులను ఎన్నుకోవాలని హితవు పలికారు. నాటి సిద్ధాంత రాజకీయాలు, కష్టపడే మనస్తత్వమే తదనంతర కాలంలో అటల్ బిహారీ వాజ్‌పేయీ, అద్వానీ లాంటి అగ్రనేతల మధ్య కూర్చుని పనిచేసే అవకాశాన్ని, దేశంలోనే రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవిని అందించిందని పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ జైలు జీవితం – లాయర్ కోటు నుంచి ప్రజా సేవకుడి వైపు

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన తాను సాధారణ విద్యార్థి నాయకుడిగా ఎదిగానని వెంకయ్యనాయుడు తెలిపారు. తల్లి కోరిక మేరకు లాయర్ కావాలని కోర్సు పూర్తి చేసినప్పటికీ, జయప్రకాష్ నారాయణ గారి సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఎమర్జెన్సీ కాలంలో 17 నెలల 25 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఇందిరా గాంధీ ఆనాడు జైల్లో పెట్టడం వల్లే తాను లాయర్ నల్లకోటు వదిలి, ప్రజాసేవకుడిగా తెల్ల చొక్కా, తెల్ల పంచె వేసుకుని నిత్యం ప్రజల్లో ఉండే భాగ్యం కలిగిందని చమత్కరించారు. ప్రజా జీవితంలో క్రమశిక్షణతో ఇష్టపడి కష్టపడి పనిచేస్తే ఏనాడూ నష్టం జరగదని, నేటి యువత ఈ లక్షణాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఒంగోలు గిత్త జాతి పరిరక్షణ – పల్లెల వికాసమే దేశ వికాసం

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘ఒంగోలు గిత్త’ జాతి విశిష్టతను, దాని పౌరుషాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. విదేశాల్లో మన జాతి పశువులను తీసుకెళ్లి కొత్త బ్రీడ్స్ తయారుచేస్తుంటే, మన మాతృభూమిలో వాటిని కాపాడుకోవడంలో నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. అలాగే తాను కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్నప్పుడు ‘పల్లె పల్లెకు పక్కా రోడ్డు’ ఉండాలని పట్టుబట్టి ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’ను వాజ్‌పేయీ గారి ద్వారా ప్రారంభంపజేశానని వివరించారు. గ్రామానికి రోడ్డు లేకపోతే డాక్టర్, ట్రాక్టర్, అభివృద్ధి ఏదీ రావని, పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మి పనిచేశానని తెలిపారు.

ప్రకృతి పరిరక్షణ – సమన్వయంతోనే సమగ్ర అభివృద్ధి

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను, పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. చెరువులు, కాలువలు, రోడ్ల ఆక్రమణలకు దూరంగా ఉండాలని కోరారు. సన్మానాలు, శాలువాలు కప్పడం కంటే ఆడంబరాలు తగ్గించి ప్రేమతో గౌరవించుకోవడం ముఖ్యమని సూచించారు. “ప్రకృతిని మనం ప్రేమిస్తే – ప్రకృతి మనల్ని రక్షిస్తుంది” (Love and live with nature) అనే సూత్రాన్ని పాటిస్తేనే సమాజం ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, కమిషనర్లు సమన్వయంతో (Team Work) పనిచేస్తే ఏ నగరమైనా ఊహించని రీతిలో అభివృద్ధి సాధిస్తుందన్నారు. నేడు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, ప్రపంచ ప్రసిద్ధ ఐటీ సంస్థలకు తెలుగువారే సీఈఓలుగా నాయకత్వం వహించడం మన నేల తెలివితేటలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ 150 ఏళ్ల చరిత్రతోపాటు రానున్న కాలంలో ఒంగోలు భవిష్యత్తును నిర్మించాలి. నగరాభివృద్ధి అంటే ఎత్తైన భవనాలు, రహదారులే కాదు, ప్రజలకు అవసరమైన తాగునీరు, పారిశుధ్యం, గృహవసతి, ఆరోగ్యం, పౌర సదుపాయాలు అందించినపుడే అభివృద్దికి అవకాశం ఉంటుందన్నారు. ప్రజల భాగస్వామ్యమే నగరాభివృద్ధికి అసలైన బలం. ఒంగోలు అభివృద్ధి ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడి పై బాధ్యత ఉందన్నారు. స్వచ్ఛ భారత్‌, అమృత్‌ 2.0, పీఎం గ్రామీన్ సడక్ ఆవాస్‌ యోజనతో పట్టణ జీవన ప్రమాణాల మెరుగుదలకు అవాకాశం ఏర్పడుతుందన్నారు. యువత విద్య, విజ్ఞానం, సాంకేతికతలో పోటీపడి రాణించడమే కాకుండా భాష, సంస్కృతి, ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సినవ అవసరం ఉందన్నారు. పర్యావరణం, ప్రజా ఆస్తులు, సామాజిక ఐక్యత ప్రతి పౌరుడి బాధ్యత. ఒకే రోజు భారీ సుమారు ఎనభై వేల గృహాల నుండి తడి చెత్త, పొడి చెత్త వేరుచేసే పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టి ప్రపంచ రికార్డులో నమోదు చేయించడం అభినందనీయమన్నారు. ఒంగోలు అభివృద్ధికి సేవలందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు, పౌరుల సేవలను విస్మరించ కూడదన్నారు. గత వైభవాన్ని గౌరవిస్తూ.. వర్తమాన బాధ్యతను నిర్వర్తిస్తూ.. భవిష్యత్తును సంకల్పంతో నిర్మించాలి.
ఒంగోలులో జల వనరుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి.

గతంలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లు, మౌలిక వసతులు, అడవుల అభివృద్ధి వంటి అంశాల్లో ఎన్నో పరిమితులు ఉండేవని. ప్రస్తుతం అభివృద్ధికి అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఒంగోలు నగరం అభివృద్ధి, సౌభాగ్యం, సాంస్కృతిక వైభవంతో శతాబ్దాల పాటు విరాజిల్లాలి అని ఆకాంక్షించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో ఒంగోలును ‘వికసిత ఒంగోలు’గా తీర్చిదిద్దాలి తద్వారా వికసిత ఒంగోలు ద్వారా వికసిత ఆంధ్రప్రదేశ్‌కు పునాది వేయాలన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనతో వికసిత భారత నిర్మాణానికి దోహదపడాలి ఇందుకోసం అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు.
రాజ్య సభ సభ్యులు బాష్యం రామ కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో పలు హోదాలు నిర్వర్తించి అనంతరం ఉపరాష్ట్రపతి గా విధులు నిర్వహించిన ముప్పవరపు వెంకయ్య నాయుడుఆడర్శనీయుదని కొనియాడారు.ఒంగోలుకు ఒక ప్రత్యేకమైన చరిత్ర, గుర్తింపు ఉన్నాయన్నారు. 1876 సెప్టెంబర్ 30 న ఒంగోలు మున్సిపాలిటి గా ఉంటూ నేడు కార్పోరేషన్ గా ఏర్పతడటం ఒక చరిత్ర అని అన్నారు. ఒంగోలు జిల్లా ప్రతిబ కు కొదవలేదని, ఒంగోలు గిట్టకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు.
రాష్ట్ర ఇందన శాఖా మంత్రి గొట్టి పాటి రవికుమార్ మాట్లాడుతూ…. ఘన చరిత్ర ఒంగోలు సొంతమని, ఎంతో మంది పోరాట యోధులు, కవులు , ప్రముఖులు ఉన్నారన్నారు. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఒంగోలు భాగమని తడుపారు జిల్లా ఏర్పడి కార్పోరేషన్ స్థాయికి ఎదిగిందన్నారు. అద్దంకి రాజుల పాలనలో పలు శాసనాలలో ఒంగోలు ప్రస్తావన ఉందన్నారు. ఒకే రోజు చాల మొత్తంలో చెత్త సేకరణ ద్వారా ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకోవడం గొప్ప విషయమన్నారు. యం.వెంకయ్య నాయుడు గారు గొప్ప వ్యక్తీ, మంచి నేత,అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు.
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ నూటా యాభైవ సంవత్సర సంబరాలు నిర్వహంచు కోవడం విసేశామన్నారు,. ఒంగోలులో పుట్టిఒంగోలు వాసిగా నేడు గవర్నర్ హోదాలో ఈ కార్యాక్రమానికి హాజరైన కంభం పాటి హరిబాబుగారికి అబినందనలు తెలియ చేస్తూ ఒంగోలు ఘనతను ప్రపంచానికి తెలియ చెప్పిన ఘనత స్థానిక శాసన సభ్యుడు దామచర్ల జనార్దన్ అని కొనియాడారు. నూటా యాభై సంవత్సారాల గుర్తుగా ఒకే రోజు 150 మెడికల్ క్యాపులు నిర్వహించడం విసేశామన్నారు. ఒంగోలు విద్యా, విద్య రంగంలో విరాజిల్లుతున్నదన్నారు. శక్తి సామర్ద్యాలకు ప్రతీక ఒంగోలు గిత్త అని అన్నారు,.ఒంగోలు మరింత ముందు పదంలో ఉండాలన్నారు.
పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ మాగుంట సుబ్బరీమి రెడ్డి ద్వారా రాజకీయాలలోకో రావడం జరిగిందన్నారు. ఈ రోజు వేడుకలు నిర్వహించు కోవడం గొప్ప విషయమన్నారు.అమృత్ 1.0 కార్యక్రమ ప్రదాత వెంకయ్యనాయుదని కొనియాడారు. కేంద్ర మత్రిగా అధిక సంఖ్యా తిడ్కో గృహాలను కటాయించారన్నారు, ఒంగోలు వాసి కంభం పాటి హరిబాబు అని కొనియాడారు.

జిల్లా కలెక్టర్ పి.రాజాభాబు మాట్లాడుతూ ……ఒంగోలుకు బి.పి.సి.యల్,ఇండో సోల్ వంటి భారీ పరిశ్రమలు రానున్నాయని, తద్వారా ఉపాటి అవకాశాలు ఏర్పదతాయాన్నారు. అదే విధముగా కొత్తపట్నం హార్బర్, రిలియన్స్ వారి బయో గాస్ ప్లాంట్, మరియు రామాయ పట్నం పోర్టు ఏర్పాటు జరుగుతున్నాయన్నారు. ఒంగోలు మరో మెట్రోపాలిటన్ సిటిగా రూపాంతరం చెందుతుందని ఆశా భావం వ్యక్తం చేసారు.
స్థానిక శాసన సభ్యులు దామచర్ల జనార్ధనరావు మాట్లాడుతూ ఒంగోలు మున్సిపాలిటి ఏర్పడి నూటా యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. మాజీ ఉప రాష్ట్ర పతి యం.వెంకయ్య నాయుడు పద్మ విభూషణ్ బిరుదు పొందారన్నారు. వారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయములో టిడ్కో గృహాలను మంజూరు చేశారన్నారు. ఈ తరం వారికి తెలిసేలా 20 మంది ప్రాముఖల విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒంగోలు ఖ్యాతి ని దేశ విదేశాలకు తెలిసేలా గ్యాలక్సి గ్రానైట్ చేసిందన్నారు. ఆరు వేల టిడ్కో గృహాలు త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయాణ రెడ్డి, సాంస్కృతిక శాఖ చైర్ పర్సన్ తేజస్వి,పలువురు శాశన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, విజయకుమార్,హర్షవర్ధన్ రాజు, పలువురు ఎమ్మేల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, మైనార్టీ వ్యవహారాలకు సలహాదారులు ఎం.ఏ. షరీఫ్.తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భాగా పలువురు ప్రముఖులను సత్కరించారు.తొలుత పలువురు విదార్ధినీ విద్యార్దులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *