తాళ్లూరు: 70వ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి రెజ్లింగ్‌లో స్థానిక వీకే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పి.శృతి, సీహెచ్ రష్మిత, జి.కీర్తన, జి.కావ్య, ఏ.కార్తీక్ కుమార్, జి. వినయ్, డి.మణికంఠ ప్రతిభకనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పీడీ పిల్లి వెంకట నారాయణ తెలిపారు. బొద్దికూరపాడు విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం వెలుగొండలో జరిగిన జిల్లా స్థాయి రగ్బీ గేమ్ అం డర్-17 మందా రాజ్‌కోటి, గోకుల చరిత్, అండ ర్-14 విభాగంలో కొప్పుల ఓబులేసురావు, పనుల మర్రిబోయిన రామ్‌చరణ్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ రవిప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: