బేగంపేట అక్టోబర్ 2(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని పురస్కరించుకుని, శుక్రవారం సికింద్రాబాద్ ఎం.జి. రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహం వద్ద మహా నాయకుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, ఎన్ డి ఎం ఏ మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి, నియోజకవర్గానికి చెందిన బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు.
ముందుగా మర్రి గాంధీ విగ్రహాని కి అదే ప్రాంగణంలో శాస్త్రి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులుఅర్పించారు.ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ
అక్టోబర్ 2వ తేదీన ఇద్దరు మహనీయుల జయంతి రావడం మనందరికీ గర్వకారణమని అన్నారు.గాంధీ చూపిన సత్యం, అహింస మార్గాలు, శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదం నేటికీ దేశానికి దిక్సూచి గా ఉన్నాయన్నారు . గాంధీ స్వచ్ఛతా స్ఫూర్తితోనే ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్, శాస్త్రి స్ఫూర్తితో రైతు, సైనిక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. వారి ఆశయాలను నెరవేర్చడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ యువ నాయకులు మర్రి పురురవ రెడ్డి స్థానిక డివిజన్ అధ్యక్షులు సందీప్ వర్మ సీనియర్ నాయకులు పెద్ది రవీందర్, దయానంద్ రావు, నర్సింగ్ యాదవ్, ఆకుల ప్రతాప్, సి.కె. నర్సింగ్ రావు, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్ కొలరే, సునీల్ ఉపాధ్యాయ్, ఆకుల విజయ్, ప్రవీణ్, శ్రవణ్, గుంటి సత్యనారాయణ, సంధ్య లక్ష్మి, వి. సత్యనారాయణ, యం. రఘునాథ్ గౌడ్, కిరీట, రాజీవ్ దేశ్ పాండే, మాంచాల గోపి, కె. నరేష్, బి. వికాస్, పిట్ల శ్రీనివాస్, పార్శి పరమేశ్, బొజ్జ నర్సింగ్ రావు, కె. శ్రవణ్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: