బేగంపేట అక్టోబర్ 2(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు దీపక్ జాన్,సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ బేగంపేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధం, రాంగోపాల్ పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు త్రికాల మనోజ్ కుమార్ ల ఆధ్వర్యంలో రాంగోపాల్‌పేట ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. టీపీసీసీఉపాధ్యక్షు
రాలు డాక్టర్ కోట నీలిమ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు విశాల్ సుదామ్, త్రికాల మనోజ్ కుమార్ నిర్వహించారు.
మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అక్కడ శాంతియుత మౌన దీక్ష చేపట్టారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, ప్రజాస్వామ్య హక్కులను స్మరించుకుంటూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. దేశంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన, పారదర్శక ఎన్నికల వ్యవస్థను పరిరక్షించడంతో పాటు రాజ్యాంగ విలువలను కాపాడటానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి అభిషేక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ గౌస్,బేగంపేట డివిజన్ అధ్యక్షుడు నసీరుద్దీన్ (అడ్డు ) కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: