బేగంపేట అక్టోబర్ 4, ( జె ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ పీజీ కళాశాల వద్ద విద్యార్ధుల ధర్నా చేపట్టారు.కళాశాల గేటు కు తాళాలు వేసిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. చివరికి పోలీసులు కళాశాల గేట్ తాళాలను పగలగొట్టడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.హాస్టల్ వసతితోపాటు మెస్ లో సౌకర్యాలు సరిగా లేవని కళాశాలలో ఉన్న సమస్యలను వెంటనేపరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకుదిగారు.
300 మందికి నాలుగు బాత్ రూమ్ లు మాత్రమే ఉన్నాయని,మెస్ లో 15 ఏళ్ల నాటి నాసిరకం వస్తువులే వంటకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.100 వృక్షాలను కొట్టి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని ఆరోపించారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: