తాళ్లూరు: గ్రామ స్థాయిలో నమస్యల తక్షణ పరిష్కారం కోనమే విలేజ్ లెవల్ పీజీఆర్ఎస్ (స్పందన) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు. విఠలాపురం గ్రామంలో సోమవారం విలేజ్ లెవల్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ రమణా రావు, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, ఏం .ఈ. ఓ సుబ్బయ్య , ఎపీఎం దేవరాజ్, ఎపీఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల ఎఈఓలు రామక్రిష్ణా రెడ్డి, హనుమంత రావు, సుబ్బా రావు, హెచ్ఎన్ రవి లు పాల్గొన్నారు. రెవిన్యూ సమస్యలపై ఆరు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు. టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, నాయకులు మానం రమేష్ బాబు, బి ఓబులు రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: