ప్రకాశం జిల్లాలో ఈ-సంజీవని కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలిజిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్, ఛాంబర్లో ఆధ్వర్యంలో ఈ-సంజీవని కార్యక్రమం అమలుపై సమీక్ష

ఒంగోలు, అక్టోబర్ 5: ప్రకాశం జిల్లాలో ఈ-సంజీవని టెలీమెడిసిన్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో ఈ-సంజీవని కార్యక్రమం అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, అవసరమైన మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో మొత్తం 62 ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో, ఇందులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈ-సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గుర్తించిన ఆరోగ్య కేంద్రాల్లో పేషెంట్ కేర్ కోఆర్డినేటర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ద్వారా ఈ-సంజీవని సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నట్లు తెలిపారు. రోగులకు నాణ్యమైన సాధారణ వైద్య సేవలతో పాటు మాతా-శిశు సంరక్షణ, చిన్నారుల వైద్య సేవలు, అంటువ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించిన వైద్య సలహాలు, కౌన్సెలింగ్, ఫాలోఅప్ సేవలు, వైద్య నిపుణుల టెలీ కన్సల్టేషన్, మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సేవలు అందించనున్నట్లు వివరించారు.
అదేవిధంగా, జిల్లా ఆసుపత్రి కోఆర్డినేటర్ డాక్టర్ కె.వి. లక్ష్మీకుమారి మాట్లాడుతూ, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలోని 7 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మరియు కందుకూరు ఏరియా ఆసుపత్రులను ఈ-సంజీవని సేవల కోసం గుర్తించినట్లు తెలిపారు. ఆయా ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజలకు టెలీమెడిసిన్ సేవలను, స్పెషలిస్ట్ వైద్యుల అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లా ఆసుపత్రి(రిమ్స్ )ప్రతినిధులు ఈ సంజీవిని కార్యక్రమానికి ఒక ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశామని తద్వారా స్పెషలిస్ట్ సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ బి శ్రావణ్ కుమార్ , డాక్టర్ నబి,డాక్టర్ నిరంజన్, మరియు ఎన్ హెచ్ ఎం ప్రోగ్రాం అధికారి సుబ్బలక్ష్మి, జిల్లా మాస్ మీడియా అధికారి బి నరసింహారావు , డిప్యూటీ అధికారి కె ఏ రాజు, ప్రోగ్రాం అధికారులు ప్రభాకర్ రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *