బేగంపేట అక్టోబర్ 6,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 61 వ పుట్టినరోజు వేడుకలు మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ లలో నిర్వహించిన వేడుకలకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. మోండా మార్కెట్ లో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్రపటానికి చిరు వ్యాపారులు పాలాభిషేకం నిర్వహించారు.
బేగంపేట డివిజన్ లో …
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు ను పురస్కరించుకుని బేగంపేట మాజీ కార్పొరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి ల ఆధ్వర్యంలో బేగంపేట లోని దేవనార్ బ్లైండ్ స్కూల్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ విద్యార్థుల తో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు.
విద్యార్థులకు ఆర్ధిక సహాయం.
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకుడు నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో తలసాని సాయి కిరణ్ యాదవ్ 6 గురు పేద విద్యార్థులకు ఫీజు కోసం ఒకొక్కరికి 10 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి.మహేశ్వరి, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్, ఆరీఫ్, శేఖర్, నాగరాజు గౌడ్, జావీద్, అడ్డు, నాని తదితరులు పాల్గొన్నారు.
మోండా డివిజన్ లో…
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మోండా డివిజన్ లోని మార్కెట్ లో మధు ఆధ్వర్యంలో, పాట్ మార్కెట్ లో జనరల్ మార్కెట్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు తలసాని సాయి కిరణ్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మార్కెట్ లో నిర్వహించిన వేడుకలలో ముందుగా మార్కెట్ లోని వ్యాపారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ ను కట్ చేసి తినిపించారు. అదేవిధంగా స్థానికంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాట్ మార్కెట్ లో కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, మార్కెట్ ప్రధాన కార్యదర్శి మధు, నాయకులు వెంకటేష్ జాదవ్, మహేందర్, హమీద్, ఆసీఫ్, సంతోష్, ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్ పేట డివిజన్ లో..
డివిజన్ లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద మాజీ కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి ఆధ్వర్యంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ హేమలత, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్, అబ్బాస్, నాగభూషణం, సీమ, రంజిత్, సాయి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బోయిగూడా లోని ఫ్లోరా హోటల్ వద్ద నిర్వహించిన వేడుకలలో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, సాదం బాలరాజ్ యాదవ్, వెంకటరమణ, అరుణ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, శైలేందర్, మిట్టపల్లి బాబూరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: