దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డు జాన్ కాంప్లెక్స్ లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక సేవా సంఘం కార్యాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక సేవా సంఘం కార్యాలయం ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. సమితి అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి మాట్లాడుతూ .. సమితి కార్యాలయం ప్రారంభోత్సవ ముఖ్య ఉద్దేశం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను చైతన్యపరిచే ఆయా వర్గాల పిల్లలను ఉన్నత చదువులపై దృష్టి పెట్టించటం సమితి ద్వారా వారిని ప్రోత్సహిస్తామని ఆయా వర్గాల ప్రజల సమస్యలపై ఆ సమస్యలో పరిష్కారం అయ్యేంతవరకు ఆ వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు . అక్టోబర్ 10 వ తేదీ (శనివారం) ఉదయం 10:30 కు ప్రారంభించనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక సేవా సంఘం కార్యాలయ ప్రారంభోత్సవమునకు నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలతో పాటు అంబేద్కర్ వాదులు దళిత నాయకులు సామాజికవేత్తలు తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు . ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజికసేవా సంఘం అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాచపూడి మోషే, కోశాధికారి ఇత్తడి జోషి , సమితి ముఖ్య సలహాదారులు నేరెళ్ల జోన్ , కార్యదర్శి దిడ్ల రమేష్ , సమితి కమిటీ సభ్యులు ఇత్తడి జాన్ , ఇత్తడి ఫ్రాంక్లిన్, మక్కెన దీవెనరాజు , గర్నెపూడి గురు , దళిత నాయకులు గోళ్ళ పాటి అచ్చయ్య , గర్నెపూడి ప్రసన్న కుమార్ పలువురు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: