ఉప్పుగుండూరులో అక్రమంగా పూడ్చి వేస్తున్న నాగన్నవాగు పనులను నిలిపివేయించండి — గ్రామానికి వరద నీరు,మెట్ట భూముల్లోకి వరదనీరు రాకుండా చేయండి -మంగళగిరి టిడిపి ఆఫీస్ కి ఫిర్యాదు చేసిన గ్రామటీడీపీ నేతలు

నాగులుప్పలపాడు,, అక్టోబర్10 : ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో వైసీపీ నేతలతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వందేళ్లుగా ఉన్న నాగన్న వాగును పూడ్చి వేస్తున్నారని దీని ద్వారా ఎగువ నుండి వచ్చే వరద నీరు గ్రామం పైకి రావడంతో పాటు సమీప ప్రాంతంలోని మెట్ట భూములన్నింటికీ వరద నీరుతో ముంచేస్తుందని ఆ గ్రామ టీడీపీ నాయకులు శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కు హాజరై గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు లిడ్ క్యాప్ రాష్ట్ర చైర్మన్ పిల్లి మాణిక్యరావుకు వినతి పత్రాన్ని అందించారు. మా గ్రామంకు దక్షిణం వైపుగా నాగన్నవాగు ప్రవహిస్తుందని ఈ వాగు పరిసర ప్రాంతాల్లో చీమకుర్తి పట్టణం కు చెందిన వైసిపి నాయకుడుతో కలసి ఉప్పుగుండూరు గ్రామంలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి వెంచర్ వేశారని దానికోసం నాగన్న వాగును పూర్తిగా పూడ్చివేస్తున్నారని మాణిక్యరావు దృష్టికి తీసుకువచ్చారు దీని ద్వారా వర్షాకాలంలో ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరద నీరంతా గ్రామం మీదకు రావడంతో పాటు వాగు పరిసరాల్లోనే మెట్ట భూములన్నీ నీటి ముంపు కు గురై ఆస్తి నష్టం, పంట నష్టం, పశునష్టం వాటిల్లుతుందని ఆయన ఎదుట వాపోయారు. స్థానిక తహసిల్దార్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై ఒంగోలు ఆర్డీవోకు కూడా తప్పుడు నివేదికల అందించి వ్యాపారుల సొంతభూముల్లోనే వాగు ఉందని దీనిని వారు పూడ్చుకుంటున్నారని అబద్ధ ప్రచారాన్ని చేస్తున్నారని తెలియజేశారు. వాగు పరిసరాలలో రైతు వారి కోష్టాలు మెట్ట భూములు తో పాటుగా, గ్రామం లోని కమ్మ, బలిజ రజకులు కులాలకు సంబంధించి వారు సుమారు వెయ్యి కుటుంబాల కు పైగా వాగు వెంబడి జీవిస్తున్నారని వారందరి జీవనానికి వరద నీరు ప్రతి ఏడాది ప్రమాదకరంగా మారుతుందని ఇంకా వాగు పూడ్చివేయటంతో పూర్తిస్థాయిలో వరద ఉధృతి గ్రామం మీదకు వచ్చి తీవ్రమైన ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. గత నాలుగు నెలల కాలం నుండి మండల రెవెన్యూ అధికారులతో పాటుగాఒంగోలు ఆర్డిఓ,జిల్లా కలెక్టర్ అన్ని స్థాయిలలో వినతి పత్రాలు ఇచ్చామన్నారు. కానీ స్థానిక నాగులుప్పలపాడు తహసిల్దార్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కయ్యారని అధిక మొత్తంలో ముడుపులు తీసుకొని ఒంగోలు ఆర్డిఓకు మరియు జిల్లా కలెక్టర్లకు తప్పుడు నివేదికలు అందిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గ్రామం లో ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయని వాటిపై ఫిర్యాదులు చేస్తున్న జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతోనే రాష్ట్ర టీడీపీ పార్టీ కార్యాలయం కి రావడం జరిగిందన్నారు మా బాధను అర్థం చేసుకొని నాగన్న వాగును పూర్వస్థితిలో ఉంచేలా చర్యలు తీసుకొని గ్రామం పైకి వరద నీరు రాకుండా చేయాలని వారు కోరారు దీనిపై స్పందించిన పిల్లి మాణిక్యరావు ఒంగోలు ఆర్డిఓ తోటి ఫోన్లో మాట్లాడారు గ్రామంలో రైతులుకు మరియు ప్రజలకు నష్టం కలిగించే చర్యలను చేస్తున్న వారిని నివారించాలన్నారు అదేవిధంగా వందేళ్లుగా ఉన్న నాగన్న వాగును పూడుస్తుంటే మండల తహసిల్దారు వారికి వత్తాసు పలుకుతున్నట్లుగా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారని దీనిపైన తక్షణమే విచారణ చేపట్టి నాగన్న వాగును పూడ్చి వేసే పనులను నిలిపివేయాలని ఆర్డీవోకి తెలియజేశారు. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టి కూడా తీసుకువెళ్తానని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉప్పుగుండూరు తెలుగుదేశం పార్టీ నాయకులు పిన్నింటి నాగేశ్వరరావు, దొడ్డపునేని నాగేశ్వరరావు, గోగినేని దుర్గాప్రసాద్, పావులూరి లతీష్, దొడ్డపనేని శ్రీనివాసరావు, నల్లూరి భాస్కరరావు, దాసరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *