సనత్ నగర్ అక్టోబర్ 11 జె ఎస్ డి ఎం న్యూస్)
సనత్ నగర్ బస్టాండ్ వద్ద ఉన్న దర్గాలో శనివారం రాత్రి నిర్వహించిన గ్యార్వీ షరీఫ్ వేడుకలలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, ఖలీల్, ఫాజిల్, జమీర్, నిర్వాహకులు ఖలీల్, జావీద్, ఖలీమ్, ఫైజల్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: