పునఃపరిశీలన చేయాలని నిర్వాహకులు కోరిన నేపథ్యంలో, పోలీసు శాఖ వారి అభ్యర్థనను పరిశీలించినప్పటికీ, అనుమతికి సంబంధించి విధించిన నిబంధనలు, షరతులను పాటించకపోవడంతో చలో కలెక్టరేట్ కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్లు ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో పాటు, ప్రజలకు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే సభలు, సమావేశాలకు అనుమతులు మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నందున నలుగురికి మించి వ్యక్తులు ఒకచోట గుమిగూడరాదని డిఎస్పీ గారు తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, అనుమతి లేని ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనకుండా పోలీసు శాఖకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: