ఎన్నికల్లో గెలవలేక పోలీసులను అడ్డు పెట్టుకుని అధికార పార్టీ నేతలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, అక్రమాలను ఎదిరించి ప్రతి చోట వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యురాలు జెడ్పీ మాజీ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మ స్పష్టం చేశారు. దర్శి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. 28 వార్డుల్లో పోటీకి ఉత్సాహం చూపుతున్న నాయకులు, కార్యకర్తలతో వార్డుల వారీగా ప్రత్యే కంగా సమావేశం అయ్యారు. వార్డుల్లో స్థితిగతులు, రిజర్వేషన్ల వారీగా వార్డుల్లో పార్టీ బలాబలాలు, ఎవరు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. రిజర్వేషన్లు ఖరారైన తరువాత మళ్లీ అందరితో మరొకసారి మాట్లాడి మంచి వ్యక్తులను నిలబెట్టి
గెలిపిద్దామని వారికి భరోసా ఇచ్చారు.
వైఎస్సార్ సీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి…..
ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వెంకా యమ్మ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, నాయకుడు
వైఎస్సార్ సీపీ విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అందరి సమష్టి కృషితో దర్శి నగర పంచాయతీలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవే యడం ఖాయమని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్ట పడి పని చేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులు పెట్టాలని చూస్తే మీకంటే ముందు తానే నిలబడతానన్నారు. పోటీ చేసే అందరినీ జైల్లో పెట్టాలంటే ఇక్కడ జైళ్లు సరిపోవని, మనందరం కలసికట్టుగా ధైర్యంగా ఎదుర్కొంటే ఆ పరిస్థితులు
కూడా రావన్నారు.
జగనన్న సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాం..
గత ప్రభుత్వంలో ప్రజలకు జగనన్న అందించిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లామని బూచేపల్లి అన్నారు. రెండున్నరేళ్లుగా కూటమి అధి కారంలోకి వచ్చిన తరువాత జగనన్న ఇస్తున్న పథకాలు తీసేశారని, సంక్షేమం అభివృద్ధి ఆటకెక్కిం చారని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారని, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. మహిళలకు ఇస్తానన్న హామీ లన్నీ ఎగ్గొట్టి వారిని మోసం చేశారని గుర్తు చేశారు. బీసీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయ కుండా వారిని దారుణంగా మోసం చేశారన్నారు.
కూటమిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని స్పష్టం చేశారు. కనీసం తాగునీరు కూడా అందక నగర పం చాయతీలో ప్రజలు బిందెలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చే దుస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొ చ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిం దేమీ లేక పోయినా ఎన్నికల్లో పోలీసులను అడ్డుపె ట్టుకుని గెలవాలని చూస్తున్నారన్నారు. ఎన్ని అడ్డం కులు వచ్చినా ముందుండి మీ అందరినీ గెలిపించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. కార్యక్ర మంలో పార్టీ మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీరెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మాజీ వైస్ ఎం పీపీ సోము దుర్గారెడ్డి,వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయ్ భాస్కర్, , మాజీ సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డి, మాజీ జెడ్పీటీసీ దామెర్ల చంద్రం, కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి, తుళ్లూరి బాబు రావు, జగన్నాథం మోహన్ బాబు, ఆవుల జ్యోతి శివారెడ్డి, పెద్దిరెడ్డి నారాయణ రెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఇరుగుల శ్రీనివా సరెడ్డి, నాయకులు కర్ణా భాస్కర్ రెడ్డి, కట్టెకోట హరీష్, అంకాల శ్రీను, అంకాల నాగయ్య, అన్నవ రపు రవి, పాణెం మజ్ఞువలి, కొడవటి జాన్, గర్ని పూడి సామ్యేల్, పాశం సురేష్, గంజి వెంకటే శ్వరరెడ్డి, భవనం కొండారెడ్డి, వెంకటరెడ్డి, కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చిన్నా, ఏడుకొండలు, బ్రహ్మయ్య, నాయకులు, కార్య కర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: