తౌశిక్ ,మౌలాబి మరణాలకు కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి

నాగులుప్పలపాడు, అక్టోబర్ 12,\ : తౌశిక్ మౌలాబి ల మృతికి కారుకులైన సింగరాయకొండ చైతన్య నవోదయ పాఠశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సీనియర్ నాయకులుఈదుమూడి మాజీ ఎంపీటీసీ కొమ్మూరి రవి, కొలకలూరి విజయ్ కుమార్ లు సంయుక్తంగా తెలియజేశారు. సోమవారం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఒంగోలులోచేపట్టిన మహా ధర్నాకు పోలీసులు అనుమతి లేదంటూ నాగులుప్పలపాడు మండలంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులను స్థానిక నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సింగరాయకొండ లో చైతన్య నవోదయ పాఠశాలలో విద్యార్థి తౌశిక్ ను పాఠశాల యాజమాన్యం అన్యాయంగా పొట్టను పెట్టుకుందని అదేవిధంగా బిడ్డ మృతికి బాధ్యులైన పాఠశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని ఏడు నెలలకు పైగా అలుపెరుగని పోరాటం చేసి ఆ తల్లి మౌలాబి ఆత్మహత్య చేసుకుని మరణించిందని దీనిని మానవీయ కోణంతోచూచి చలించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలోచేపట్టిన
ఒంగోలు లోజరిగే మహాధర్నా కు మద్దతుగా స్టేషన్ ఎదుట తౌశిక్, మౌలాబి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి నినాదాలు చేసి ఆ ధర్నా కు సంఘీభావం ప్రకటించారు ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ మరియు కొమ్మూరి రవి,కొలకలూరి విజయకుమార్ ల తో పాటుగా సునీల్, సుబ్బారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *