అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక వ్యూహం: జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు -రాష్ట్రాన్ని మూడు ఆర్థిక ప్రాంతీయాలుగా విభజించిన ప్రభుత్వం — తొమ్మిది జిల్లాల అమరావతి రీజియన్‌లో క్రియాశీలక ప్రాంతంగా ‘ప్రకాశం -​ సిఆర్‌డిఎ (CRDA), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతస్థాయి టీమ్‌తో కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం -జిల్లా పురోగతికి అడ్డంకిగా ఉన్న ప్రతిబంధకాల (Bottlenecks) తొలగింపుపై వినూత్న ప్రణాళికలు

రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రకాశం జిల్లా సమగ్ర స్వరూపాన్ని మార్చేందుకు పటిష్టమైన చర్యలు ప్రారంభమయ్యాయి. స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సీఆర్‌డీఏ (CRDA) మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు చెందిన ఉన్నతస్థాయి అధ్యయన బృందంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. స్మిత జె కుట్టుకట్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల నిపుణుల టీమ్ జిల్లాలోని ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలపై అధ్యయనం చేయడానికి ఇక్కడికి విచ్చేసింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

​ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో దాగి ఉన్న మూడు సెక్టార్లలోని (వ్యవసాయం,పరిశ్రమలు, సేవ రంగం)అపారమైన అభివృద్ధి అవకాశాలను వెలికితీయడం మరియు ఇక్కడి సహజ సిద్ధమైన వనరులను అమరావతి రీజియన్‌లోని పొరుగు జిల్లాల వనరులతో అనుసంధానించడమే (Interlinking of Regional Resources) ఈ నివేదిక ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
బిపిసిఎల్ (BPCL) , ఇండోసోల్ వంటి భారీ పరిశ్రమలు మరియు ఇతర ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.
​ముఖ్యంగా రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణంతో పాటు దానికి అవసరమైన అనుబంధ మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని అధికారులు వెల్లడించారు. భారీ పరిశ్రమల రాక మరియు రామాయపట్నం పోర్టు సేవలు ప్రారంభం కావడం వల్ల వాటి ఆధారిత అనుబంధ సంస్థలు, డౌన్‌స్ట్రీమ్ పరిశ్రమలు విస్తృతంగా ఏర్పాటు కానున్నాయి.
​ఈ ప్రాజెక్టులు మరియు అనుబంధ సంస్థల ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు.
జిల్లాలో పారిశ్రామిక పురోగతికి, మౌలిక సదుపాయాల విస్తరణకు మరియు పెట్టుబడుల ఆకర్షణకు అడ్డంకిగా మారిన క్షేత్రస్థాయి సాంకేతిక, ఆర్థిక ప్రతిబంధకాలను తొలగించడంపై కలెక్టర్ స్వయంగా సమగ్ర డేటా మరియు గ్రాఫికల్ విశ్లేషణతో కూడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధ్యయన బృందానికి దిశానిర్దేశం చేశారు. రవాణా సదుపాయాల మెరుగుదల, లాజిస్టిక్స్ పెంపు, మరియు ఎగుమతి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రకాశం జిల్లా ఎంతగానో అనుకూలమైనదని నొక్కిచెప్పారు.
​ముఖ్యంగా జిల్లాలోని గనుల శాఖ , ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ , పరిశ్రమల శాఖ, ఉద్యానవన శాఖ, సాగునీటి ప్రాజెక్టుల శాఖ, రోడ్లు మరియు భవనాల శాఖ , మత్స్య శాఖ, వ్యవసాయ శాఖ మరియు సూక్ష్మ సేద్య అభివృద్ధి సంస్థ (APMIP) వంటి కీలక శాఖలను ఒకే వేదికపైకి తెచ్చి, అంతర-శాఖల సమన్వయం సాధించడం ద్వారా ఆర్థిక పురోగతిని పరుగులు తీయించవచ్చని కలెక్టర్ తెలిపారు.

క్షేత్రస్థాయి పర్యటనలు, గణాంకాల ఆధారంగా ఈ అధ్యయన బృందం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నమూనా నివేదికను సమర్పిస్తుందని, దాని ఆధారంగా ప్రకాశం జిల్లా ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీలు, మౌలిక ప్రాజెక్టులు మరియు ఆర్థిక కేటాయింపులను పొందుతుందని వివరించారు.

​ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రధాన ప్రణాళికాధికారి సుధాకర్ రెడ్డి , APMIP ZM మదన్ మోహన్, పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసరావు,లతో పాటు సంబంధిత శాఖల జిల్లా అధిపతులు (HODs), రీజినల్ ప్లానింగ్ నిపుణులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *