దర్శిలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు వినూత్న శిక్షణా కార్యక్రమం

దర్శి: దర్శిలోని శ్రీ ప్రశాంత స్కూల్ స్టెప్ ఆడిటోరియంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు నాణ్యమైన బోధనా నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఇంగ్లీష్ సాహిత్య నిపుణులు జి. కిరణ్ (G. Kiran) మరియు ప్రముఖ శిక్షకులు టి. సూర్యనారాయణ (T. Surya Narayana) హాజరై విశేష శిక్షణ ఇచ్చారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు మరియు నిపుణులు పాల్గొని పలు అంశాలపై శిక్షణ అందించారు:

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  • కె.వి. రమణా రెడ్డి: రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, కనిగిరి
  • కె. విజయలక్ష్మి: LFL ప్రధానోపాధ్యాయురాలు, చింతలపాలెం, కనిగిరి
  • కంచర్ల వెంకటేశ్వర్లు: విద్యావేత్త & జనవిజ్ఞాన వేదిక బాధ్యులు, ఒంగోలు
  • రంగా గారు: హిందీ పండిట్, గంగదేవిపల్లె, దర్శి
    పాల్గొన్న పాఠశాలలు:
    ఈ కార్యక్రమానికి శ్రీ ప్రశాంత స్కూల్, ఝాన్సీ స్కూల్ , దర్శి మరియు స్వామి శివానంద స్కూల్, కారవాది, ఒంగోలు ఊధ్యాయిని ఉపాధ్యాయులు అత్యంత ఉత్సాహంగా హాజరై శిక్షణ పొందారు.
    ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ… నేటి మారుతున్న విద్యా విధానంలో ఉపాధ్యాయులు సరికొత్త బోధనా పద్ధతులను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ శిక్షణ ఉపాధ్యాయుల నైపుణ్యాలను మరింత మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు ఎస్.వెంకటేశ్వర్లు కరస్పాండెంట్ (శ్రీ ప్రశాంత స్కూల్) తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *