హైదరాబాద్, అక్టోబరు 13 ( జె ఎస్ డి ఎం న్యూస్ ) :
అగరబత్తుల తయారీలో 78 ఏళ్ల అనుభవం కలిగిన సైకిల్ ప్యూర్ అగరబత్తి సంస్థ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని రాయల్ సీక్రెట్, బన్సూరి దర్బార్ పేర్లతో కొత్త సువాసనలను ఆవిష్కరించింది. హైదరాబాద్‌లోని వివాంటాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ రంగ వీటిని పరిచయం చేశారు.
ఏటా 1,200 కోట్లకు పైగా అగరబత్తులను ఉత్పత్తి చేస్తున్న సంస్థ.. దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా పంపిణీదారులు, ఐదు లక్షలకు పైగా రిటైల్ దుకాణాల ద్వారా ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 75కుపైగా దేశాలకు ఎగుమతులు చేస్తోంది. హైదరాబాద్‌లోని ప్యాకింగ్ యూనిట్లో సుమారు 300 మంది, సుగంధ ద్రవ్యాల తయారీ విభాగంలో 100 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచుతూ, సంప్రదాయ పరిమళాలను ఆధునిక ఆవిష్కరణలతో వినియోగదారులకు అందిస్తున్నామని అర్జున్ రంగ తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: