సికింద్రాబాద్, అక్టోబర్ 13 (జె ఎస్ డి ఎం న్యూస్ ) : ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా రామంతాపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్)లో ‘రైజ్ 2026’ సైన్స్ ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఇస్రో రిజిస్టర్డ్ సంస్థ ‘స్పేస్ అధ్యాన్’, ఇస్రో-ఎన్ఆర్ఎస్సీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు పాఠశాలల నుంచి 84 మంది విద్యార్థులు పాల్గొని సరికొత్త రాకెట్, అంతరిక్ష నమూనాలను ప్రదర్శించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన ఇస్రో ఎన్ఆర్ఎస్సీ అధికారి డాక్టర్ ఆర్. శ్రీనివాస్, సీబీఎస్ఈ ప్రాంతీయ అధికారి సునీల్ కుమార్ జంగం విద్యార్థుల ప్రతిభను అభినందించారు. విద్యార్థుల్లోని శాస్త్రీయ జిజ్ఞాసను వెలికితీసేందుకే ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు హెచ్పీఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహారెడ్డి, స్పేస్ అధ్యాన్ డైరెక్టర్ పద్మశ్రీ నాయుడు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: