బేగంపేట అక్టోబర్ 13,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ నెల 18 వ తేదీన నెక్లెస్ రోడ్ లోని కర్బలా మైదానంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి కర్బలా మైదానం పరిసరాలు, హుస్సేన్ సాగర్ ఘాట్ లను ఆయన పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. బతుకమ్మ చివరి రోజు18 వ తేదీన సద్దుల బతుకమ్మకు వచ్చే మహిళలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పల్లెల్లో పుట్టిన బతుకమ్మ ను దేశ విదేశాలలో ఘనంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మను మహిళలు 9 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ చివరి రోజు నిర్వహించే సద్దుల బతుకమ్మకు నెక్లెస్ రోడ్ లోని మహిళలే కాకుండా సికింద్రాబాద్ ప్రాంత పరిసరాలలోని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరైతారని వివరించారు. ఈ సంవత్సరం కూడా 18 వ తేదీన నిర్వహించే సద్దుల బతుకమ్మ సంబరాలకు వచ్చే మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేయనున్నట్లు చెప్పారు. స్టేజీ, లైటింగ్, సౌండ్ సిస్టమ్ తో పాటు వాహనదారులకు ఇబ్బందులు కాకుండా ట్రాఫిక్ డైవర్షన్ కు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలకు త్రాగునీటిని కూడా అందుబాటులో ఉంచుతామని అన్నారు. బతుకమ్మ లను నిమజ్జనం చేసే హుస్సేన్ సాగర్ లోని ఘాట్ వద్ద లైటింగ్ తో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట వాటర్ వర్క్స్ GM శ్రీధర్ రెడ్డి, ఎలెక్ట్రికల్ ADE దుర్గ ప్రసాద్, HMDA DE గణేష్, శానిటేషన్ DE భార్గవ్, హార్టికల్చర్ అధికారి రాజిరెడ్డి, GHMC AE చంద్రశేఖర్, స్ట్రీట్ లైట్ AE భోజ్య నాయక్, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు టి. శ్రీహరి, కిషోర్, కోటేశ్వర్ గౌడ్, శేఖర్, ఆంజనేయులు, సతీష్, గణేష్, అరుణ్ భట్, తదితరులు ఉన్నారు.






Save or share this story as a newspaper-style Epaper Clip: