తాళ్లూరు: ఎట్టకేలకు స్థానిక మండల ప్రజా పరిషత్ ఎన్నికల నేపధ్యంలో ప్రాదేశికాల రిజర్వేషన్ల ఖరారుతో రాజకీయ పార్టీలలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైనది. తాళ్లూరు ఎంపీపీ, జెడ్పీటీసీలు రెండు ఆన్ రిజర్వ్ (ఉమెన్)కు కేటాయించటంతో రాజకీయ పార్టీలతో అభ్యర్ధుల వెతుకులాట మొదలైనది. అదే విధంగా మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలలో తూర్పుగంగవరం-1, తూర్పుగంగవరం-2, శివరామపురం ( ఆన్ రిజర్వ్), తాళ్లూరు-1, తాళ్లూరు-2, తురకపాలెం, నాగంబొట్ల పాలెం ఆన్ రిజర్వ్ (ఉమెన్స్), దోసకాయలపాడు, లక్కవరంలు (బీసీ), బొద్దికూరపాడు (బీసీ,ఉమెన్) మాధవరం, మన్నేపల్లి (ఎస్సీ), మల్కాపురం, వెలుగు వారిపాలెం లు ఎస్సీ (ఉమెన్) కు కేటాయించారు .

Save or share this story as a newspaper-style Epaper Clip: