తాళ్లూరు: ఆధునిక సాంకేతికతో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు మరింత మేలు జరుగుతుందని జిల్లా ఎపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసులు అన్నారు. తాళ్లూరు రైతు సేవా కేంద్రంలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వారోత్సవాల సందర్భంగా రైతులకు ఉద్యాన వన పంటల సాగులో ఆధునిక పద్దతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాళ్లూరు వ్యవసాయాధికారి ప్రసాద రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ లక్ష్యాలు, ఉద్యాన రంగ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న చేయూత ఎపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసులు వివరించారు. ఈ పథకంలో 13 ప్రధాన అంశా
గురించి రైతులకు అవగాహన కల్పించారు. వాతావరణ మార్పులకు తట్టుకునే ఉద్యాన పంటలు, సూక్ష్మసేద్యం, ఫెర్టిగేషన్ విస్తరణ, ఉద్యాన యాంత్రీకరణ, పంట కోత అనంతరం నిర్వహణ, ఉత్పత్తుల నాణ్యత, మెరుగుదల, మార్కేట్ మౌళిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన వ్యాధిరహిత మొక్కల సరఫరా, సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ తదితర అంశాల పై వివరించారు. గ్లోబర్ హార్టికల్చర్ హబ్ వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అర్హత ఉన్న వివిధ పథకాలకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పొత్సాహాలను పొందాలని సూచించారు. కొత్త పట్నం ఉ ద్యానవనశాఖాధికారి ఎన్ తేజ, ఎపీఎం దేవరాజ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: