అద్దంకి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు -ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి:జిల్లా ఎస్పీ -ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే ప్రధాన లక్ష్యం: జిల్లా ఎస్పీ

మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందన్నారు. కావున, ప్రతి ఒక్కరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు గురువారం అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని కట్టక్రింద పాలెం స్కూల్, ఎన్టీఆర్ నగర్ లో పాఠశాల, శ్రీ ప్రకాశం జిల్లా పరిషత్ బాయ్స్ హై పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను మరియు చెక్ పోస్ట్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులు, రాకపోకల మార్గాలు, రూట్ మ్యాప్‌లు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత తదితర అంశాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ …… అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులు, 22 పోలింగ్ లొకేషన్లు, 49 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 31 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అనంతరం ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి, దర్శి ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. నగదు, అక్రమ మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణాపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని, రౌడీషీటర్లు( చెడు నడత గల వ్యక్తులు),ట్రబుల్ మాంగర్స్ ముందస్తుగా 85% బైండోవర్ చేయడం జరిగిందన్నారు. వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచడం జరుగుతుంది.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర వస్తువులను పంపిణీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటమన్నారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచమన్నారు.

ఎన్నికల నేపథ్యంలో ప్రవేట్ లైసెన్సు ఆయుధాలను ముందస్తుగా డిపాజిట్ చేయించే చర్యలు చేపట్టడం జరిగిందని, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు, నిరాధార వార్తలు, ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు చేయవద్దన్నారు.ఎన్నికల సమయంలో ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖకు, జిల్లా యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కోరారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రత్యర్థి అభ్యర్థులు సహా పోటీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి, ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

కార్యక్రమం లో అడిషనల్ ఎస్పీ యన్.యుగంధర్ బాబు, దర్శి డిఎస్పీ బాలమురళి కృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, అద్దంకి సీఐ సుబ్బరాజు మరియు సిబ్బంది ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *