తాళ్లూరు: మండలంలో పంచాయితీల రిజర్వేషన్లు ఖరారు కావటంతో ఆయా గ్రామాలలో రాజకీయ చర్చలు మొదలైనాయి. రాజకీయ పార్టీ నాయకులు తమ కేటాయించిన కేటగిరిలో అభ్యర్థుల వెతుకులాటను ముమ్మరం చేసారు. మండలంలోని 16 పంచాయితీలలో తాళ్లూరు, బెల్లంకొండ వారి పాలెం, దోసకాయల పాడు, నాగంబొట్ల పాలెం లు (ఆన్ రిజర్వ్ ) కు, మల్కాపురం, మన్నేపల్లి, తురక పాలెం, వెలుగు వారి పాలెంలు (ఆన్ రిజర్వ్ మహిళ)లకు, తూర్పుగంగవరం, లక్కవరంలు (బీసీ జనరల్), బొద్దికూరపాడు, రామభధ్రాపురం (బీసీ మహిళ)కు, మాధవరం, శివరామపురం (ఎస్సీ జనరల్)లకు, కొర్రపాటి వారి పాలెం, విఠలాపురం (ఎస్సీ మహిళ)లకు కేటాయించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: