తాళ్లూరు: స్థానిక ఎన్నికలను కార్యకర్తలు సమిష్టిగా ఎదుర్కోని విజయం సాధించాలని వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సీఈసీ మెంబర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, మెధావుల సంఘ రాష్ట్ర కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, ఉపాధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మారం ఇంధ్రసేనా రెడ్డి, మాజీ సర్పంచి పులి క్రిష్ణా రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్ జి వెంకటేశ్వర రెడ్డి, యూత్, ఎస్సీ అధ్యక్షులు విష్ణు, యామర్తి ప్రభుదాన్, ఐ గోపినాధ్ రెడ్డి, మాజీ నర్పంచిలు మేకల చార్లేన్ సర్జన్, కోట వెంకట రామి రెడ్డి, వలి, ఓబులు రెడ్డి, నాయకులు నునుం నాగార్జున రెడ్డి, యారం రమణా రెడ్డి, స య్యద్ లతీఫ్, కోట కళింగ రెడ్డి, చిన నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: