జిల్లా ఆయుష్ విభాగ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చినట్లు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భ్రమరాంబ తెలిపారు. ఈ శిబిరంలో 156 మందికి వైద్య సేవలు అందించినట్లు చెప్పారు. ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పించి, రోగులకు పరీక్ష నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: