బేగంపేట అక్టోబర్ 18,(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ ) :
బేగంపేట శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వి ఎన్ వి సత్యనారాయణ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ చెక్కల సుభాష్ ముదిరాజ్ అనిల్ కుమార్ యాదవ్ ను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆదివారం శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.ప్రతి రోజు అమ్మవారికి 108బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన, ప్రతి నెల పౌర్ణమి రోజున ఉదయం 10గంటలకు శ్రీ చండి హోమం నిర్వహించ నున్నారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఈ ఓ వి. ఎన్ వి సత్యనారాయణ, ఫౌండర్ ఫ్యామిలీ మెంబెర్ చెక్కల సుభాష్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: