చేనేత కుటుంబం నుంచి సీఈవో స్థాయికి.. మసన రమేష్‌కు కలాం జాతీయ పురస్కారం….

హైదరాబాద్ అక్టోబర్ 18,(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ ) :
ఖమ్మం చేనేత కుటుంబం నేపథ్యం నుంచి వచ్చి సీఈవో స్థాయికి ఎదిగిన ఖమ్మం జిల్లా నివాసి మసన రమేష్‌కు ప్రతిష్టాత్మక ‘డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం నేషనల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు–2026 లభించింది.సమాజహిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ విశేషసేవలందిస్తున్నందుకు త్రేతాయుగ్‌ ఫౌండేషన్‌ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.గత 35 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో మానవ వనరుల అభివృద్ధి, మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్‌ గృహాల నిర్మాణం తదితర అంశాల్లో రమేష్ నిరంతరం శ్రమిస్తున్నారు. మ్యాక్స్‌ సొసైటీల ద్వారా డ్వాక్రా సంఘాలబలోపేతానికితోడ్పాటునందించడంతో పాటు ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, గోల్డ్‌ మర్చంట్‌ సర్టిఫికెట్‌ శిక్షణ, సౌర విద్యుత్‌ రంగాలపై రమేష్ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఇప్పటివరకు సుమారు 10 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించేలాచేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సమాజానికి చేసిన ఈ బహుముఖ సేవలను గుర్తించి త్రేతాయుగ్‌ ఫౌండేషన్‌ జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. జిల్లాకు చెందిన వ్యక్తికి ఈ గౌరవం దక్కడం పట్ల ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, పలు సంస్థల మార్కెటింగ్‌ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ రమేష్ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తనకు లభించిన గొప్ప పురస్కారాన్ని అపు రూపంగా భావిస్తానని అన్నారు. ఇది తన బాధ్యతను మరింత పెంచుతుందని అన్నారు.భవిష్యత్ లో కూడా తన బాధ్యతలను మరింతగా విస్తరిస్తానని రమేష్ తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *