శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం.

బేగంపేట అక్టోబర్ 19 (జేఎస్ డీఎం న్యూస్) :
అమీర్పేట శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఏ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు సోమవారం ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఈవో వంగ అంబుజా, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కే. మల్లికార్జునప్పల ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనానంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ గావించారు. ఆలయానికి ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *