బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
రాయలసీమ, కోస్తాంధ్రలోని వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
నేడు అక్టోబర్ 19న చిత్తూరు, నెల్లూరు తిరుపతి, ప్రకాశం జిల్లాలకు, అక్టోబర్ 20న గుంటూరు జిల్లాకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగనుంది. అక్టోబర్ 21 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశముంది.

Save or share this story as a newspaper-style Epaper Clip: