సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్‌లో బియ్యం దుకాణాలపై పౌరసరఫరాల శాఖ అధికారుల తనిఖీలు……రాష్ట్ర ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా హోల్ సేల్, రిటైల్ ధరలకు మాత్రమే విక్రయించాలి…. హైదరాబాద్ పౌర సరఫరాల శాఖ అధికారి.. శ్రీనివాస్.

బోయిన్ పల్లి నవంబర్ 2,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్‌లో బియ్యం దుకాణాలపై పౌరసరఫరాల శాఖ అధికారులు సోమవారం ఆశస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా హోల్ సేల్, రిటైల్ ధరలకు మాత్రమే బియ్యం విక్రయించాలి అని, అలా కాకుండా బియ్యన్ని బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్‌లోని హోల్‌సేల్, రిటైల్ బియ్యం దుకాణాలపై పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో, బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్కెట్‌లోని బియ్యం దుకాణాల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సంబంధించిన ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. వివిధ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు, ప్రతి దుకాణం వద్ద ధరల పట్టికలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేసివినియోగదారులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా హోల్‌సేల్, రిటైల్ ధరలకు మాత్రమే బియ్యంవిక్రయించాలని వ్యాపారులకు స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *