నియోజక వర్గంలో మురుగు నీటి సమస్యల ను పరిష్కరించాలని జలమండలి ఎం డీ అశోక్ రెడ్డిని కలిసి న మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి.

బేగంపేట నవంబర్ 4,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
సనత్ నగర్ నియోజక వర్గంపరిధిలోని వివిధ డివిజన్ లలో మురుగు( డ్రైనేజ్ ఓవర్ ఫ్లో ) నీటి సమస్యల ను పరిష్కరించాలని కోరుతూ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి జలమండలి ఎం డీ అశోక్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి
రాంగోపాల్ పేట్ డివిజన్ – ఆవులమంద వివేకానంద స్ట్రీట్ లో
గత కొన్ని నెలలుగా అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని,రంగ్రేజీ బజార్ లో పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ పనులు పూర్తి చేయకుండానే రోడ్డు పనులు చేయడం వల్ల తరచూ డ్రైనేజీ లీకేజీ సమస్య వస్తోందన్నారు.
మెక్ లాన్ గూడ్ లో
ప్రతిరోజూ డ్రైనేజీ లీకేజీలు ఏర్పడి మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుందన్నారు. అదే ప్రాంతంలో నల్లాల్లో కూడా కలుషిత నీటి సరఫరా అవుతుందన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్
కంటోన్మెంట్ ప్రాంత మురుగు నీటి ని కళాసిగూడ నాలకు కాకుండా, పికెట్ నాలాలో కలపాలని కోరారు. ఈ సమస్యలతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని
ఎం డీ ని శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మర్రి వెంట మహంకాళి – సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ , రాంగోపాల్ పేట్ డివిజన్ అధ్యక్షులు సందీప్ వర్మ , బీజేపీ నాయకులు వజనాల దయానంద రావు, శ్రీనివాస్ యాదవ్, కిరణ్, బి. వికాస్, కె. నరేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *