చీమకుర్తి మండలం బూధవాడ గ్రామంలో టిడిపి కార్యకర్తల దాడిలో గాయపడిన దళితులను వైఎస్సార్సీపీ కార్యకర్తలను ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. బూదవాడలో ఎలక్షన్లో ఓటు వేయలేదని, మేము పోటీ చేయవద్దంటే పోటీ చేశారనే కారణంతో టీడీపీ వాళ్లు సంబరాలు చేసుకుంటూ తాగిన మైకంలో ఊర్లో ఉన్నటువంటి మాదిగ పల్లే పైబడి వారిని రాడ్లతో,కర్రలతో కొట్టారని ఆరోపించారు. అంతేకాకుండా రక్షించవలసినటువంటి పోలీసులే దెబ్బలు తిన్నటువంటి వ్యక్తుల్ని మరలా వారిని కొట్టడం ఇది విచారించదగిన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ రెడ్డి , మాజీ జడ్పిటిసి వేమా శ్రీనివాసరావు, వైసీపీ కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: