కార్తీకమాసం విశిష్ఠను తెలియచేయటం అబినందనీయం –

కార్తీకమాసం విశిష్ఠను తెలియచేయటం అబినందనీయమని జిల్లా (IRCS)ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి మరియు మానవత స్వచ్చంద సేవా సంస్థ సెంట్రల్ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి అన్నారు . దర్శి లోశ్రీ ప్రశాంత ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ లో కార్తీకమాసం విశిష్ఠను తెలియచేస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమానికి కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు . ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న కపురం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ…..విద్యార్థులైన చిన్న పిల్లల్లో వున్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి,మంచి నడవడికలు నేర్పి,విద్యా బుద్ధులను నేర్పి,ఒక ఉపాధ్యాయుడు గానే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను నేర్పే వైద్యునిగా, నిరంతరం విద్యార్థుల సంక్షేమం కోరుకొనే మహోన్నత వ్యక్తి ఉపాధ్యాయుడని, సనాతన సంస్కృతులు కనుమరుగై పోతున్న ఈ సమాజంలో, గత స్మృతులను నెమరువేశుకునే దానిలో భాగంగా,విద్యార్థులకు పండుగల గురించి, పర్వదినాల గురించి తెలియజేసి, విద్యార్థులకు చిత్రలేఖనం, ఆటలు, వక్తృత్వం, వ్యాసరచనలు,ఈ నాటి విద్యా విధానంలో భాగంగా చేర్చి విద్యార్థులను మంచి ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదగ డానికి ఉపాధ్యాయలు నిరంతరం కృషి చేస్తారని, ఏమీ ఇచ్చినా ఉపాధ్యాయల రుణం తీర్చుకోలేమని గురువుల సేవలను కొనియాడారు.ముందుగా సరస్వతి దేవి, స్వామి వివేకానంద చిత్రపటాలకు పూల మాలలు వేసారు . ఈ కార్యక్రమంలో ఆద్యాత్మిక గురువులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యావనుమంది మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *