మన్సురా సైబర్ హైస్కూలు విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన…..ట్రాఫిక్ నియమ, నిబంధనలపై తల్లిదండ్రులకు, స్నేహితులకు వివరించాలన్న తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు.

బేగంపేట నవంబర్ 26, ( జె ఎస్ డి ఎం న్యూస్ )
ట్రాఫిక్ నియమ, నిబంధనలపై ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులకు, స్నేహితులకు వివరించాలని తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు పిలుపు నిచ్చారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ కే. రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో గురువారం బేగంపేట ప్రకాశం నగర్‌ మన్సూరా సైబర్ హైస్కూల్‌లో ట్రాఫిక్ నియమ, నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మన్సూరా సైబర్ హైస్కూల్ కరస్పాండెంట్, న్యాయవాది మహమ్మద్ ముధస్సి ర్ జూహ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఏసీపీ జి.శంకర్ రాజు హాజరయ్యారు.బేగంపేట ట్రాఫిక్ ఆర్‌ఐ డి.ఆర్. ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి శంకర్ రాజు మాట్లాడుతూ విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. చిన్నప్పటి నుంచే సురక్షిత ప్రయాణ అలవాట్లు పెంపొందించుకోవాలని, తల్లిదండ్రులు, స్నేహితులకు కూడా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో ‘ట్రాఫిక్ సేఫ్టీ క్లబ్’ల ఏర్పాటులో భాగంగా విద్యార్థులు రోడ్ సేఫ్టీ అంబాసిడర్లుగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అడ్వకేట్ మహ్మద్ ముదస్సిర్ జుహా, ప్రిన్సిపాల్ ఎం. సుష్మ, ప్రిన్సిపాల్ ఇంజనీర్ మహ్మద్ ముజమ్మిల్ జుహా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *