బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ అవగాహన సదస్సు..క్యాండిల్ లతో ర్యాలీలు.

సికింద్రాబాద్, నవంబర్ 26 (జే ఎస్ డీ ఎం న్యూస్ )
బాల్య వివాహాల నిర్మూలనకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ (BVM) 100 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 21 నుండి డిసెంబర్ 21 వరకు దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ మేరకు చాదర్‌ఘాట్ కాళీఖబర్‌లోని ప్రభుత్వ సిటీ మోడల్ హైస్కూల్, నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాలల్లో అవగాహన సదస్సులు జరిగాయి. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం మరియు బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రారంభ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 27న చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో సమాజంలోని అన్ని వర్గాలు, యువత భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని వక్తలు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ సిటీ మోడల్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలు కె. మధుశాలిని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది అమరజ్యోతి, అన్వర్, ఆశాజ్యోతి, సుష్మ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అలాగే మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్ మాధవి పర్యవేక్షణలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఆశ్రిత (ASRITHA) సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ వి. పర్వతాలు, ప్రతినిధులు ఎన్. పద్మ, నగ్మా, పవిత్ర, చంద్రకళ, హేమలత, టెర్రాస్ తదితరులు పాల్గొని విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *