బేగంపేట నవంబర్ 27(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నశా ముక్త్ భారత్’ (మాదకద్రవ్యాల రహిత భారత్) కార్యక్రమంలో భాగంగా బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాలలోని ఎన్ఎస్ఎస్ (NSS), ఎన్సీసీ (NCC), మరియు క్రీడా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 200 మంది విద్యార్థినులు బల్కంపేట రోడ్డులోని సత్యం టాకీస్ నుండి మైత్రీవనం వరకు ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. పద్మావతి ప్రారంభించారు. ఇందులో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కె. వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ హెచ్. కిషన్, ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ కృష్ణప్రియతో పాటు ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: