లక్కవరం మైనర్ ఇరిగేషన్ పెద చెరువులో మూడు సంవత్సరాల పాటు చేపలు వేసి పెంచుకోవటానికి మంగళవారం పంచాయితీ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. సర్పంచి నన్నం వరలక్ష్మి, ఎంపీటీసీ రమణమ్మ, ఈఓఆర్డీ ఎన్ యూ ప్రసన్నకుమార్, గ్రామకార్యదర్శి నూరుల్లా, బికే పాడు గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగంలు పాల్గొని వేలం పాటను నిర్వహించారు. గ్రామానికి చెందిన లోకి రెడ్డి వెంకట నరసింహా రెడ్డి అధికంగా రూ. 25 లక్షల పదివేలకు పాడుకుని హక్కును దక్కించుకున్నారు: కార్యక్రమంలో గ్రామ నాయకులు తూము వెంకట సుబ్బా రెడ్డి, ఉప సర్పంచి పెద్దయ్య, మేడగం వెంకటేశ్వర రెడ్డి, బొడ్డు హనుమా రెడ్డిలు పాల్గొన్నారు.
